లక్కీ బాస్కర్ సినిమా నుండి డబ్బు & లైఫ్ కోసం మనం నేర్చుకోవాలిసిన 5 పాఠాలు 

Top 5 Life and Money Lessons from Lucky Bhaskar Movie 

 https://youtu.be/NF1oWwcuC40

 హలో ఫ్రెండ్స్, నేను మీ 

Wealth Coach - Ramakrishna 

 లక్కీ భాస్కర్ మూవీ లో ఫస్ట్ ఫైనాన్షియల్ గా అత్తగారి ఇంట్లో అతనికి జరిగిన అవమానం కావచ్చు, బ్యాంకులో అతనికి అసిస్టెంట్ మేనేజర్ గా ఇవ్వాల్సిన పొజిషన్ లో ఇంకొకళ్ళకి పోజిషన్  ఇవ్వడం కావచ్చు, అప్పులవాడు గల్లీలో అందరి ముందు గల్లా పెట్టుకొని జేబు చింపి స్కూటర్ గుంజుకుపోవడం కావచ్చు,  ఈ అవమానాలన్నీ భరిస్తూ.. కొన్ని కొన్ని స్టెప్స్ తోటి తను అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయేంత గొప్పగా ఎదగడం అనేది ఆ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది.

 ఓకే తను వెళ్తున్న విధానం రాంగ్ అయి ఉండొచ్చు బట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గా మనకి చాలా సక్సెస్ అనిపిస్తది కదా! ఈ సినిమా నుంచి మన జీవితానికి ఒక ఐదు పాఠాలు నేర్చుకోవచ్చు.

Lesson 1: ఈ సొసైటీలో లేదా రిలేటివ్స్ లో మనకు ఎంత గౌరవం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ మన ఒంటి మీద ఉన్న సొమ్ము ఇవి రెండే నిర్ణయిస్తాయి.

 మన ఒంటి మీద సొమ్ము కనపడాలి, బ్యాంకు బ్యాలెన్స్  ఎక్కువగా ఉంటే అప్పుడే మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది, ముక్కు మొహం తెలియనోడు కూడా వచ్చి నేను ఫలానా చుట్టం అని పలకరిస్తాడు. అవతలికి వెళ్లి ఫలానా భాస్కర్ మా ఫ్రెండ్, మా చుట్టం అవుతాడు అని ఎక్కడ లేని చుట్టరికాలాన్ని కల్పించుకుంటారు. సొసైటీలో డబ్బుని బట్టే రెస్పెక్ట్ ఉంటుంది నీకు డబ్బు ఉందా ఆ డబ్బు ఉన్నవాన్ని ఒకవేళ మిస్టేక్ చేసినా దాంట్లో రెండు వర్గాలు ఏర్పడతాయి ఒక వర్గం వాళ్ళు  అతను చేసింది కరెక్టే అని, మరో  వర్గం వాళ్ళు  అతను చేసింది తప్పు అని వాదిస్తారు.  అదే పేదవాడు మిస్టేక్ చేస్తే వాడిని వెలేస్తారు. డబ్బుకి అంత ఇంపార్టెంట్ ఉంది అనే విషయం అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయింది.

Lesson 2: అప్పు ఇచ్చేవాడు దేవుడే కానీ ఆ అప్పు టైం కి తీర్చకపోతే వాడే మన పాలిట రాక్షసుడు అవుతాడు.

మీరు సినిమా చూసి ఉంటారు భాస్కర్ ఆ కాలనీలో ఉండే  ఒక వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బు వడ్డీకి తీసుకుంటాడు. ఆ వ్యాపారి అప్పు తీర్చమన్నప్పుడల్ల రేపిస్తా మాపిస్తా అని తప్పించుకుంటూ  ఉంటాడు. ఇంట్లో ఉండి కూడా లేడని వైఫ్ తోటి చెప్పిస్తా ఉంటాడు. ఒకరోజు బజార్ లో కనపడి బాగా గొడవ చేసి స్కూటీ కీస్ జేబులో ఉంటే జేబు ని చింపి  స్కూటర్ తీసుకొని వెళ్ళిపోతాడు. చూడండి అవసరం ఉన్నప్పుడు ఎంత బాగా  ఆ టైం లో ఆ వ్యాపారి దేవుడు, భాస్కర్  టైం కి రిటర్న్ ఇవ్వలేకపోయినప్పుడు వ్యాపారి రాక్షసుడిలా మరునాడు. మన లైఫ్ లో కూడా చుడండి బ్యాంక్స్ అండ్ అప్స్ వాళ్ళు వెంటబడి లోన్స్ ఇస్తారు. కట్టలేకపోయామా బ్యాంకులో వాళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు  రాక్షసుల్లా ఇబ్బంది పెడతారు.  అందుకే చిన్న చిన్న అవసరాలకు కూడా లోన్లు తీసువద్దు.  అప్పు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి దీన్ని సమయానికి  తీర్చలేకపోతే వచ్చే పరిణామాలు ఎంత డేంజర్ గా ఉంటాయి ఎంత ఇబ్బందిగా ఉంటాయి అనేది ఈ మూవీ ద్వారా మళ్ళీ ఒక్కసారి చూపించారు. సినిమాలో ఇంకా చాలా చిన్న అవమానాలె చూపించారు బయట అయితే అంతకన్నా పెద్ద పెద్ద అవమానాలు పెద్ద పెద్ద బూతులు తిడతారు, ఇంట్లో ఉన్న పిల్లల్ని మరియు వైఫ్ ని తిడతారు చాలా పిచ్చి మాటలన్నీ వినాల్సి వస్తుంది కాబట్టి అప్పు తీసుకునే ముందు అలోచించి తీసుకోవాలి.  మనం కరెక్ట్ గా టైం కి తీర్చగలుగుతామా, అది ఏ అవసరానికి ఉపయోగపడుతుంది, మన స్థాయిని మించి తీసుకుంటున్నామా, స్థాయి లోపే తీసుకుంటున్నామా, అనేది ఒకసారి గమనించాలి.

LESSON 3 : ఒక రోజులో, ఒక అర్ధ గంట నాకు నచ్చినట్లు జరగలేదని మిగిలిన జీవితం అంతా పాడు చేసుకోలేము కదా!
బ్యాంకులో తనకి అసిస్టెంట్ మేనేజర్ గా పోస్ట్ ఇవ్వకుండా  ఇంకెవరికో ఇచ్చేస్తారు.
  ఆ మేనేజర్  ఇతన్ని రిఫర్ చేయలేదని తెలిసి వెళ్ళిపోయి నేను బెంగాలి కాదు కాబట్టి నాకు ఇవ్వలేదా ? అని  గొడవ చేస్తాడు, అంటే తనకు  ప్రమోషన్ వస్తే ఇంకో 9000 జీతం పెరిగేది.   పెరిగితే భాస్కర్  మిస్సెస్ ఏదో బిజినెస్ చేసుకుందాం అనుకుంటుంది,అలాగే తన మిస్సెస్ కి ఒక నెక్లెస్ కొనాలి
అనుకుంన్నాడు కానీ ఆ ప్రమోషన్ కాస్త వేరేవాడికి వెళ్లిపోయింది.  కోపం తట్టుకోలేక మేనేజర్ మీద సీరియస్ అయ్యాడు, చాలా గొడవ అయింది. మేనేజర్ కూడా భాస్కర్ మీద రివర్స్ అయ్యాడు, MD కి కంప్లైంట్ ఇస్తాను అంటాడు, మళ్ళీ అందరూ ఎంప్లాయిస్ మేనేజర్ ని రిక్వెస్ట్ చేసినాక మేనేజర్ నెమ్మదిస్తాడు.  ఆఫీస్ అయ్యాక మేనేజర్  వెళ్ళిపోయేటప్పుడు భాస్కర్ మల్లి సారీ చెప్తాడు,  ఆ తర్వాత తన ఫ్రెండ్ తో ఒక డైలాగ్ అంటాడు ఒక రోజులో, ఒక అర్ధ గంట నాకు నచ్చినట్లు జరగలేదని మిగిలిన జీవితం అంతా పాడు చేసుకోలేము కదా! ఎంత మంచి మాట కదా.. మన లైఫ్ లో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి. మనం అనుకున్నట్టు అన్ని  జరగవు,  మీరు ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోతుంది. లేకపోతే మీరు డబ్బులు పెడితే మీ డబ్బుతో చదువుకొని
 మీకు అవసరమైన టైం లో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు.  లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు ఆ బిజినెస్ లో  ఫ్రెండ్స్ ఎవరో మోసం చేశారు వాళ్ళంతా మోసం చేశారని ఒక మీ 60, 70 సంవత్సరాల లైఫ్ లో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు జరిగిన మిస్టేక్ ని పట్టుకొని ఏలాడుతూ మిగిలిన 68 సంవత్సరాలు 65 సంవత్సరాలు వేస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు.

Lesson 4: మనిషికి మత్తు ఇవ్వడానికి కి సిగరెట్ మందే కాదు డబ్బు కూడా మత్తు ఇస్తుంది. ఆ మత్తు మంచిదే కానీ మనం పూర్తిగా మునగనంత వరకే సేఫ్:
మన పాత హీరో రాంకీ గారు స్మగ్లింగ్ గుడ్స్ ఒక కెప్టెన్ ద్వారా ఒక షిప్ లో తెప్పించి  ఇండియాలో అమ్మేస్తూ ఉంటాడు. ఫస్ట్ టీవీ లతో స్టార్ట్ అవుతుంది.  తర్వాత ఇంకో ట్రాన్సాక్షన్, కొన్ని నెలల్లో  10 లాక్స్  ట్రాన్సాక్షన్,ఆ రోజుల్లో 10 లాక్స్ అంటే దాదాపుగా ఇప్పుడు కోటి నుండి కోటిన్నర రూపాయలతో సమానం. ఆ 10 లాక్స్ శనివారం బ్యాంకు నుంచి తెచ్చి స్మగ్లింగ్ గూడ్స్ కోసం రాంకిగారికి ఇచ్చి సోమవారం బ్యాంకు తెరిచే టైం కి బంక లో జమ చేసేవారు. ఒకసారి ఈ 10 లాక్స్ ని భాసకర్ రాంకీ గారి ఇస్తాడు.రాంకీ గారు ఆ డబ్బుతో  మూడు కార్లని సీక్రెట్ గ తెప్పిస్తాడు, ఆ కార్లు అమ్మితే  మంచి ప్రాఫిట్  వచ్చింది, ఈ లోపు రాంకీ గారు ఈ బిజినెస్ వదిలేసి అమెరికా వెళతాడు. అప్పుడు భాస్కర్ కూడా ఈ స్మగ్లింగ్ వ్యాపారం ఆపేద్దాం అని మరో పార్టనర్ & ఫ్రెండ్ అయినా ప్యూన్ కి చెబుతాడు. ఈ స్మగ్లింగ్ వ్యాపారం జూదం లాంటిది, ఈ జూదం అనేది ఒక స్టేజిలో ఆపేయాలి ఆపకపోతే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఇది చేయడం ఆపేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చింది పర్ఫెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్  చేసుకుంటే చాలు అని చెబుతాడు.  కానీ నువ్వు మానేస్తే మానేయ్ నేనైతే ఇది  కంటిన్యూ చేస్తాను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కంటిన్యూ చేశాడు.  కొన్ని రోజుల తర్వాత నైట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్య ఫోన్ చేసింది వాళ్ళ ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని.  భాస్కర్ స్టేషన్ కి వెళ్లి కొన్ని డబ్బులు పెట్టి ఫ్రెండ్ ని బయటికి తీసుకొచ్చి పావు బాజీ తినిపించి జరిగిందంతా కనుక్కున్నాడు. ఇక్కడ మనల్ని ఉద్దేశించి ఒక డైలాగ్ చెప్తాడు. మనిషికి మత్తు ఇవ్వడానికి కి సిగరెట్ మందే కాదు డబ్బు కూడా మత్తు ఇస్తుంది. ఆ మత్తు మంచిదే కానీ మనం పూర్తిగా మునగనంత వరకే సేఫ్, ఒక్కసారి ఆ మత్తులో పడి మునిగిపోయామంటే సిగరెట్ కు, మందుకు, డగ్స్ కి అలవాటై హెల్త్ లైఫ్ పాడు చేసుకున్నట్టు, చట్ట వ్యతిరేకంగా  సంపాదించే డబ్బు మత్తుకు అలవాటు అయిపోయి లైఫ్ ని పాడు చేసుకోవద్దు. కాబట్టి తప్పుడు మార్గం లో డబ్బు సంపాదిస్తున్నాం అనుకోండి 10 సార్లు తప్పించుకోవచ్చు 11 సార్లు తప్పించుకోవచ్చు అన్ని సార్లు లక్కీ టైమే ఉండదు లక్కీ భాస్కర్ కి నిజం చెప్పాలంటే చాలా లక్కీలు జరిగాయి కానీ  లైఫ్ లో నిజంగా అంత ప్రాక్టికల్ గా అన్ని లక్కీలు ఉండవు ఏదో ఒక రోజు దొరికిపోతాం. దొరికిపోయాము అంటే జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే, నువ్వేమో జైల్లో ఉంటావు ఇక్కడ నీ పెళ్ళాం  పిల్లలు సొసైటీలో భయంకరమైన నరకం చూడాల్సి వస్తుంది. జైలుకి పోయినోడు బానే ఉంటాడు కానీ బయట వున్నా కుటుంబ సభ్యులు బతకలేక సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి డబ్బు మత్తు అనేది ఒక లిమిట్ వరకు చాలా బాగుంటది.
Lesson 5: అక్రమంగా డబ్బు సంపాదించడం ఎల్లప్పుడూ ప్రమాదాలు కలిగి ఉంటుంది.
లక్కీ భాస్కర్ కి ఎప్పుడైతే ప్రమోషన్ రాలేదో అప్పటినుంచి తప్పుడు దారిలో  వెళ్లడం స్టార్ట్ చేశాడు  హర్షద్ మెహదాన్ కలవడం అక్కడ 100 కోట్లు 200 కోట్ల ఫ్రాడ్ జరగడం ఇది ముందుగానే గుర్తించి  జాబ్ రిజైన్ చేయడం, తన అకౌంట్ లో ఉన్న డబ్బు అంతా తీసేసి అమెరికాలో ఇన్వెస్ట్ చేయడం,  ఇన్వెస్టర్ వీసా తీసుకొని అమెరికా లో సెటిల్ అవ్వడం ఇవన్నీ ప్రాపర్ గా జరగబెట్టి సరిపోయింది. లేకపోతే ఫ్యామిలీ పరిస్థితి ఏమయ్యేది. అక్రమంగా డబ్బు సంపాదించడం ఏదో ఒక రోజు మన మెడకు చుట్టుకుంటది. ఎవరో ఒకళ్ళు తప్పించుకోవడానికి మన మెడకు చుట్టేస్తారు. 
చాలా మంది మిడిల్ క్లాస్ అయితే ఇలా ఇల్లీగల్ గా డబ్బు సంపాదించడానికి ఎక్కువ ధైర్యం చేయకపోవచ్చు కానీ ఇల్లీగల్ గా స్కాములలో డబ్బులు పెడుతూ ఉంటారు, ఉదాహరణకు  బిట్కాయిన్ లో ఫలానా ఇన్వెస్ట్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి నువ్వు లక్ష రూపాయలు పెట్టు ఇంకో పది మంది లక్ష రూపాయలు తీసుకొచ్చి ఈ యాప్ ద్వారా ఈ వచ్చిన డబ్బు అంతా బిట్కాయిన్ లోఇన్వెస్ట్ చేస్తారు అందరికీ పంచి పెడతారు అని చెబుతారు. ఒక చైన్ సిస్టం లాగా ప్రొడక్ట్ మనకు కనపడకుండా అందరి డబ్బులు కలెక్ట్ చేసి ఇలా చేయడం అనేది అనేది చట్టవ్యతిరేకం. కొంతమంది నువ్వు లక్ష రూపాయలు కట్టు ఇంకో పది మందిని తీసుకురా నీకో సంవత్సరానికి గోల్డ్ కాయిన్ ఇస్తా అంటారు లేకపోతే ఒక ల్యాండ్ ఇస్తా అంటారు లేకపోతే ఒక ఫ్లాట్ అంటారు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అన్ని కట్టుకున్న తర్వాత చేతులెత్తేస్తున్నారు అగ్రిగోల్డ్ లాగా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి స్కామ్స్ లో ఎక్కువగా ఇఱుకుపోతున్నారు, కంపెనీ ఏ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయింది ఆ కంపెనీ ఇంకా యాక్టివ్ గా ఉందా లేదా రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళది ఏం ప్రొడక్ట్ ఉంది ఆ ప్రొడక్ట్ నిజంగా మార్కెట్ లో  అమ్ముడు పోతుందా లేదా? నువ్వు రేపు ఆ బిజినెస్ మానేసిన ఆ ప్రొడక్ట్ నువ్వు వాడగలుగుతావా లేదా? ఆలోచించకుండా ఈజీ మనీ కోసం తొందర పడొద్దు చాలా మంది బెట్టింగ్ యాప్ లలో ఇలాంటి వాటిలో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారు.మీరు అప్పుల్లోకి వెళ్ళిపోతే ఫ్యామిలీ హ్యాపీ సంగతి దేవుడు ఎరుగు మనశ్శాంతి లేకుండా అయిపోతారు.





కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇల్లు కొనాలా? లేక అద్దె ఇంట్లో ఉంటూ Mutual Funds‌లో పెట్టుబడి పెట్టాలా? 20 ఏళ్ల కు లెక్కలు వేసి చూద్దాం

ధనవంతులు కావాలంటే Warren Buffett చెప్పిన ఈ 5 Baby Steps తప్పక Follow అవ్వాలి

ఈ 6 Assets మిమ్మల్ని కాపాడతాయి | Financial Crisis Coming? Secure These 6 Assets Now|