టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి – కానీ మనీ బ్యాక్ టర్మ్ ప్లాన్ వద్దు!
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి – కానీ మనీ బ్యాక్ టర్మ్ ప్లాన్ వద్దు ! | M oney Back Policy లో కట్టే అదే డబ్బు SIP లో పెట్టుబడి పెడితే ఎంత లాభమంటే? పదివేలలో ఒకరు మనీ బ్యాక్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే "కొనసాగితే డబ్బు తిరిగి వస్తుంది" అనే అనుకోవడం. కానీ ఇది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలుసుకుందాం. 1) అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇది ఒక ప్యూర్ రిస్క్ కవర్ ప్లాన్ . అంటే మీరు జీవించకపోతే మీ కుటుంబానికి ఒక పెద్ద మొత్తంలో సొమ్ము వస్తుంది. ఒకవేల టర్మ్ అయ్యాక కూడ మీరు బతికి ఉన్నా, ఎటువంటి డబ్బు తిరిగి రావదు. ఉదాహరణకు కార్/బైక్ ఇన్సూరెన్స్ లాగా, ఏమైనా అయితేనే డబ్బు వస్తుంది లేదంటే ఏమి రాదు, కానీ ప్రీమియం చాలా తక్కువ. అంటే నెలకు 1000 రూపాయల ప్రీమియం తో 1 కోటి రూపాలయ ఇన్సూరెన్స్ వస్తుంది. 2) మనీ బ్యాక్ టర్మ్ ప్లాన్ అంటే ఏంటి? ఇది కాస్త "మీకు ఏమీ కాకపోతే కొంత డబ్బు తిరిగి వస్తుంది" కానీ దీని ప్రీమియం 2x లేదా 3x రేట్లు ఎక్కువ ఉంటుంది. 3) ఉదాహరణ: 30 సంవత్సరాల వయసు ఉన్న రామ్ టర్మ్ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటున్నాడు ప్లాన్ కవరేజ్ ...