10 steps to Achive Financial Freedom
10 Steps to Achieve Financial Freedom
Financial Freedom( ఆర్థిక స్వాతంత్ర్యం) సాధించాలంటే –
ప్రతి మధ్య తరగతి వ్యక్తి తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విషయాలు
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి కల – ఆర్థిక స్వాతంత్ర్యం.
అంటే మనకు కావాల్సిన డబ్బు మన దగ్గర ఉండాలి,
ఎవరి మీదా ఆధారపడకుండా జీవించగలగాలి. కానీ చాలా మందికి దీన్ని ఎలా సాధించాలో స్పష్టంగా తెలియదు. ఈ బ్లాగ్‌లో అసలు సమస్య ఏమిటి? పరిష్కారం ఏమిటి? ఉదాహరణలతో సహా వివరించబోతున్నాను
Step 1: మనీ మేనేజ్‌మెంట్‌ను మొదటగా నేర్చుకోండి
Step 2. మధ్య తరగతి సమస్య – పొదుపు లేకపోవడం
Step 3. మ్యూచువల్ ఫండ్స్ & SIPలపై దృష్టి పెట్టండి
Step 4. ఇతర పెట్టుబడి మార్గాలు కూడా తెలుసుకోవాలి
Step 5. రిటైర్మెంట్ ప్లానింగ్‌ను ఇప్పుడు నుంచే ప్రారంభించండి
Step 6. స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు ఉండాలి
Step 7. గొప్ప వ్యక్తుల ఆర్థిక అలవాట్లను నేర్చుకోండి
-------------------------------------------------------------------------------------------
Step 1: మనీ మేనేజ్‌మెంట్‌ను మొదటగా నేర్చుకోండి
సమస్య: చాలా మందికి నెలకి జీతం వచ్చిన 3 రోజుల్లో ఖర్చయిపోతుంది.
ఎందుకిలా జరుగుతోంది? అసలు కారణం ఏమిటి?
మనలో చాలామంది యెల అలొచిస్థున్నారు అంటే “జీతం రాగానే మనకి కావాల్సినవి కొనుక్కుందాం” అనే మానసిక ధోరణిలో ఉంటున్నారు. దీని వల్ల మిగతా 27 రోజులు అప్పులలో గడవడం జరుగుతుంది.
అసలు కారణాలు:1. బడ్జెట్ లేకుండా ఖర్చు చేయడం.
2. 'Wants' మరియు 'Needs' మధ్య తేడా తెలియకపోవడం.
3. EMIలతోనే జీవనం సాగడం.
4. తాత్కాలిక ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం
🤔 పరిష్కారాలు – ఇప్పుడే ఆచరణలో పెట్టండి:
1. 50-30-20 బడ్జెట్ రూల్ పాటించండి.
50% – అవసరాల కోసం (అరువు, అద్దె, బిల్లులు)
30% – ఇష్టాల కోసం (వినోదం, షాపింగ్)
20% – పొదుపు మరియు పెట్టుబడుల కోసం
3. పొదుపు ఖాతాలో ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సెటప్ చేయండి.
4. ఖర్చు చేసే ముందు అవసరం ఏంటో అనవసరం ఏంటో ఆలోచనతో' చేయండి.
ఇది నాకు నిజంగా అవసరమా?
నేను దీన్ని వాయిదా వేసుకోవచ్చా?
ఇదే ధరకు మంచి ఆప్షన్ ఉందా?
Step 2. మధ్య తరగతి సమస్య – పొదుపు లేకపోవడం
సమస్య: మధ్య తరగతి వర్గం డబ్బు సంపాదించగలిగినా, పొదుపు చేయడం తెలియక ఆర్థికంగా ఎదగలేరు.
పరిష్కారం: ప్రతీ నెల సంపాదన నుండి నుంచి 10% - 20% తప్పనిసరిగా పొదుపు చేయాలి.
ఉదాహరణ: 1 నెలకు ₹25,000 వస్తే, ₹2,500ను RD వేసుకుంటే, 2 ఏళ్లలో ₹60,000 కూడగలుగుతారు.
ఇది అనుకోని అవసరంలో ఉపయోగపడుతుంది.
__________________________________________________________
Step 3. మ్యూచువల్ ఫండ్స్ & SIPలపై దృష్టి పెట్టండి
100, 500, 1000 పెట్టుబడి చేస్తే ఏం వస్తుందిలే? అని చాలామంది అనుకుంటారు.
₹500 SIPతో ప్రారంభించండి. Mutual Fund కంపెనీలు మొదటి నెలలో ₹100తో కూడా మొదలుపెట్టడానికి సదుపాయం ఇస్తున్నాయి.
ఉదాహరణ:
₹500 SIPని నెలకు 15 ఏళ్ళు వేస్తే, సగటు 12% రిటర్న్ వస్తే ₹2.36 లక్షల పైగా సంపాదించవచ్చు.
₹1,000 SIPని నెలకు 15 ఏళ్ళు వేస్తే, సగటు 12% రిటర్న్ వస్తే ₹4.75 లక్షల పైగా సంపాదించవచ్చు.
₹2,000 SIPని నెలకు 15 ఏళ్ళు వేస్తే, సగటు 12% రిటర్న్ వస్తే ₹9.50 లక్షల పైగా సంపాదించవచ్చు._____________________________________________________________
Step 4. ఇతర పెట్టుబడి మార్గాలు కూడా తెలుసుకోవాలి
చాలామంది "ఒకే ఒక్క పెట్టుబడి మార్గం" మీద ఆధారపడతారు. ఉదాహరణకు రియల్ ఎస్టేట్, లేదా బంగారం, లేదా FD ల మీద మాత్రమే ఆధారపడతారు.
దీనికి పరిష్కారం: పెట్టుబడి డైవర్సిఫై చేయాలి, మ్యూచువల్ ఫండ్, NPS, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, బంగారం లాంటి వివిధ మార్గాలు చూడాలి.
ఉదాహరణ:
* 30% SIP/Stocks లో పెట్టండి
* 30% PPF/NPSలో
* 20% FD లో
* 20% గోల్డ్ లో పెట్టండి
________________________________________________________________________________
Step 5. రిటైర్మెంట్ ప్లానింగ్‌ను ఇప్పుడు నుంచే ప్రారంభించండి
చాలామంది 50 ఏళ్ళు వచ్చిన తర్వాతే రిటైర్మెంట్
ప్లాన్ చేస్తారు. అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది.
దీనికి పరిష్కారం: సంపాదన మొదలు అయిన రోజు నుండే NPS, ULIP, SIP లేదా పింఛన్ ప్లానింగ్ ప్రారంభించండి.
ఉదాహరణ: 30 ఏళ్ల వ్యక్తి ప్రతి నెల ₹2,000 NPSలో వేస్తే – 60 ఏళ్లకు పైగా ₹25 లక్షలు విలువ చేసే పింఛన్ corpus రావచ్చు.
_______________________________________________________________Step 6. స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు ఉండాలి
ఈ మధ్య జనాలు సంపాదన మీద పెట్టే శ్రద్ధ Savings & Goals మీద పెట్టడం లేదు.
దీనికి పరిష్కారం: SMART Goals (Specific, Measurable, Achievable, Relevant, Time-bound) పెట్టుకోండి.
ఉదాహరణ 1:
Goal: పాప / బాబు 10వ తరగతి పూర్తి అయ్యే సమయానికి విదేశాల్లో చదువుకునేందుకు ₹20 లక్షలు సిద్ధంగా ఉంచాలి.
SMART Format:
S (Specific): పాప / బాబు విదేశీ విద్యా ఖర్చు కోసం పెట్టుబడి చేయాలి.
M (Measurable): ₹20 లక్షలు
A (Achievable): నెలకు ₹10,000 SIPతో
R (Relevant): పిల్లల భవిష్యత్‌కు అవసరం
T (Time-bound): 8–10 సంవత్సరాల్లో లక్ష్యం
పరిష్కార మార్గం:
మీరు నెలకు ₹10,000ను మ్యూచువల్ ఫండ్ SIP ద్వారా పెట్టుబడి పెడితే, 10 సంవత్సరాల్లో సగటు 12% రిటర్న్‌తో ₹20 లక్షల పైనే corpus ఏర్పడుతుంది.
🔹 ఉదాహరణ 2:
లక్ష్యం: 5 సంవత్సరాల్లో ఒక చిన్న ప్రాపర్టీ/ప్లాట్ కొనాలి – టార్గెట్ ₹8 లక్షలు.
SMART Format:
S: ప్లాట్ కొనుగోలు
M: ₹8 లక్షలు
A: నెలకు ₹11,000 పొదుపు
R: భవిష్యత్ ఇంటి నిర్మాణం కోసం
T: 5 సంవత్సరాల్లో
పరిష్కార మార్గం:
మీరు నెలకు ₹11,000ను FD/MF/RD/SIPల మిశ్రమంగా పెట్టుబడి చేస్తే, 5 సంవత్సరాల్లో టార్గెట్ చేరవచ్చు.
_________________________________________________________Step 7. గొప్ప వ్యక్తుల ఆర్థిక అలవాట్లను నేర్చుకోండి
మన చుట్టూ ఉన్నవారినే చూసి డబ్బు ఎలా ఖర్చు చేయాలో నేర్చుకుంటాం.
బాగా గమనించండి..
మన చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు ఏది కొనుగోలు చేస్తే – మనమూ అదే కొనాలనిపిస్తుంది.
వాళ్లు లేటెస్ట్ ఫోన్ కొనుకుంటే మనకు కూడా కావాలనిపిస్తుంది.
వాళ్లు లగ్జరీ కార్ లేదా బైక్ తెచ్చుకుంటే, మన వద్ద ఉన్నదే సరిపోదనిపిస్తుంది.
ఈలా comparison lifestyle వల్ల, మన ఖర్చులు అసలు అవసరం లేని దిశగా వెళ్తుంటాయి.ఎందుకు? ఎందుకంటే మనం వాళ్ల ఆదాయ స్థితిని చూడకుండా, వాళ్ల ఖర్చులను అనుకరిస్తాం. ఈ బలహీనతే మన పొదుపును, మన ఆర్థిక స్వతంత్రాన్ని తినేస్తోంది
దీనికి పరిష్కారం: మీ చుట్టుపక్కల ఉన్న మిడిల్ క్లాస్ వ్యక్తిని కాకుండా, నిజంగా ఆర్థికంగా ఎదిగిన వ్యక్తులను గమనించండి. వాళ్లు ఎలా ఖర్చు చేస్తారు? ఎలా పొదుపు చేస్తారు? ఎలా పెట్టుబడి పెడతారు?
🧠 వీరి అలవాట్లలోని ముఖ్యమైన పాఠాలు:
-
ప్రతి రూపాయికి బడ్జెట్ ఉంటుంది.
-
"Wants vs Needs" (కావలసినవి vs అవసరమైనవి) మధ్య స్పష్టమైన తేడా.
-
తాత్కాలిక ఆనందం కోసం కాదు, భవిష్యత్ లక్ష్యాల కోసం ఖర్చు.
-
ఎప్పటికప్పుడు పొదుపు చేయడం – అయితే జీతం వచ్చిన వెంటనే!
-
పెట్టుబడులు, SIPలు, Mutual Funds వంటి సాధనాలను వినియోగించడం.
-
Social validation కోసం ఖర్చు చేయరు. వారి లక్ష్యం – freedom, not impression.
_________________________________________________________
Step 8. అవసరంలేని ఖర్చులు తగ్గించండి
ఉదాహరణ: ₹1,000 స్పోర్ట్స్ షూ అవసరంగా ఇంట్లో ఉంటే, ఇంకా ₹5,000 బ్రాండెడ్ షూ కొనడం పొదుపుకి ఆటంకం.
ఈ రోజు ల్లో చాలా మంది అవసరంలేని వస్తువులు, లగ్జరీలు, బ్రాండెడ్ వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల:
EMI లు & క్రెడిట్ కార్డు డెబ్ట్ పెరుగుతాయి
ఈ తరహా ఖర్చులు చూడడానికి ఫ్యాషన్‌లా అనిపించొచ్చు కానీ ఆర్థికంగా ఇది భారమవుతుంది.
✅ పరిష్కారం: ‘Wants vs Needs’ తేడా తెలుసుకోండి
Needs అంటే – జీవించడానికి అవసరమైన ప్రాథమిక అవసరాలు.
Wants అంటే – మనకి ఇష్టం ఉన్న కానీ లేకపోయినా నష్టం లేని వస్తువులు/సేవలు.
NEEDS WANTS
నిత్యావసరాలు (ఆహారం, నీవాసం, దుస్తులు) ఫ్యాన్సీ రెస్టారెంట్ డిన్నర్
ఇంటి అద్దె EMIతో కార్, Bike కొనడం (లక్ష్యం లేకుండా)
విద్య కోసం లాప్‌టాప్ లగ్జరీ ఫోన్ లేదా 2వ, 3వ మొబైల్
ఆరోగ్య బీమా, బ్రాండెడ్ షూస్, Expensive ఫ్యాషన్ వస్తువులు
▶️ ఉదాహరణ 1:
సితార (28) నెల జీతం ₹40,000. ఒక్క క్రెడిట్ కార్డ్ వాడుతున్న తీరుతో ప్రతి నెల ₹5,000 లగ్జరీ ఖర్చులకు (Swiggy, Myntra, Amazon లో Sales) పోతుంది.
ఫలితం: నెలలో పొదుపు ఉండదు. బిల్ పెరిగితే డిప్రెషన్.
పరిష్కారం: Wants vs Needs గుర్తించి, నెలకు ₹3,000కు ఖర్చు తగ్గించి,
అదే డబ్బును SIPలో పెడితే, 3 ఏళ్లలో ₹1.4 లక్షల పొదుపు చేయొచ్చు!
▶️ ఉదాహరణ 2:
రాము (32) – చిన్న కుటుంబం ఉన్న మిడిల్ క్లాస్ ఉద్యోగి. ₹1,200 EMIతో ఫోన్ కొనుగోలు చేశాడు. అది అవసరమా? ఐదో ఫోన్!
ఫలితం: నెలకు ₹12,000 జీతంలో ₹2,000 EMIలు – అనవసర ఖర్చు.
పరిష్కారం: ఫోన్ కొనుగోలు వాయిదా వేసి, అదే డబ్బును Emergency Fundగా FDలో పెట్టాడు.
ప్రభావం: ఒక ఏడాదిలో ₹24,000 నిధి – హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మోచేతి బలం అయింది.
Practical steps:
👉3 నెలల ఖర్చుల జాబితా తయారుచేయండి
ఏవీ అవసరాలు, ఏవీ ఫ్యాన్సీ ఖర్చులు గుర్తించండి.
👉ప్రతి కొనుగోలుపై ప్రశ్నించండి:
“ఇది నాకు నిజంగా అవసరమా?”
“ఇది లేకపోతే నా జీవితం లో నష్టం ఉందా?”
👉షాపింగ్ పరిమితం చేయండి
ఒక లిస్ట్ తయారుచేసి దాని వరకే కొనుగోలు చేయండి.
👉సేల్ ఆఫర్లపై కంట్రోల్ పెట్టుకోండి
“Buy 1 Get 1” కాదు, “Don’t buy unless needed” అనుకోండి.
👉క్యాష్ ఉపయోగించండి
కార్డు కన్నా కరెన్సీ నోట్లతో కొనుగోలు చేస్తే ఖర్చుపై నియంత్రణ ఉంటుంది.
___________________________________________________Step 9. ఈ రోజు చిన్న నిర్ణయాలే రేపటి స్వాతంత్ర్యం
Savings & Investments తర్వాత చూద్దాం” అనడం వల్లే ఆర్థిక స్వాతంత్ర్యం మిస్ అవుతారు.
నేడు తీసుకునే చిన్న ఆర్థిక నిర్ణయాలే మీ రేపటి లక్ష్యాలను నిర్మిస్తాయి.
చిన్న పొదుపు, చిన్న పెట్టుబడి, నేడు మీ చేతిలో ఉన్న చిన్నచిన్న అవకాశాన్ని వదలకుండా ఉపయోగించుకోవడం వల్లే మీరు భవిష్యత్తులో పెద్ద లక్ష్యాలను చేరగలుగుతారు.
ఉదాహరణ 1: టిఫిన్‌ను ఇంట్లో తయారు చేసుకోవడం
మీరు రోజూ బయట టిఫిన్‌కి ₹100 ఖర్చు చేస్తున్నారని అనుకుందాం.
ఒక నెలలో మీరు 25 రోజులు బయట తినితే: ₹100 × 25 = ₹2,500 ఖర్చవుతుంది.
అదే ఇంట్లో తయారు చేస్తే ₹1,000తో సర్వైవ్ చేయవచ్చు.
అంటే నెలకు కనీసం ₹1,500 పొదుపు!
ఈ డబ్బునే SIPగా పెట్టితే → సగటు 12% రిటర్న్‌తో 5 ఏళ్లకు ₹1.25 లక్షలకు పైగా విలువ కలిగే corpus ఏర్పడుతుంది!
ఉదాహరణ 2: OTT Subscriptionsను Revise చేయడం
మీరు Netflix ₹649, Prime ₹299, Hotstar ₹299 ఇలా మూడు కలిపి నెలకు ₹1,200 ఖర్చు చేస్తున్నారని అనుకుందాం.
వాస్తవానికి మీరు ఒక్కటే ఎక్కువగా చూస్తున్నారు. రెండు తీసేసి ఆ ₹800ను పొదుపు చేస్తే?
👉 ఒక్క చిన్న నిర్ణయంతో నెలకు ₹800 పొదుపు – ఏడాదికి ₹9,600 – ఇది చిన్న Emergency కోసం బాగుంటుంది.
______________________________________________________________Step 10. ఆర్థిక నిపుణులను సంప్రదించండి
చాలామంది మిత్రుల సలహాల మీదే కుటుంబ సభ్యుల సలహా మేరకు నిర్ణయాలు తీసుకుంటారు.
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ను సంప్రదించండి.
ఉదాహరణ:** మీకు SIP, Child Plan, Retirement Plan వంటి వాటి గురించి పూర్తి విశ్లేషణ నిపుణుడే చెబగలడు.
Money Mantra Rk ప్రతి నెలా 2వ & 4 వ ఆదివారం Financial Planning Online Workshop Conduct చేస్తూ.. వుంటారు. Registration Link: whatsapp
________________________________________________________________________
ఆర్థిక స్వాతంత్ర్యం అనేది కల కాదు – క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక. ఈరోజు నుంచే మొదలుపెడితే, రేపు మీరు ఆర్థికంగా స్వతంత్రంగా జీవించే వ్యక్తి అవుతారు.
https://youtu.be/3LpPJr1VuQo
Youtube Video :👉 మీ అభిప్రాయం కామెంట్ చేయండి
📢 ఈ బ్లాగ్‌ను మీ మిత్రులకు షేర్ చేయండి
📩 ఇలాంటి మరిన్ని వ్యాసాల కోసం మా బ్లాగ్‌ను ఫాలో అవ్వండి

Super Information Sir
రిప్లయితొలగించండి