చిన్న Savings తో పెద్ద మార్పు: రోజుకు ₹10 సేవ్ చేస్తే మీ Financial Future ఎలా మారుతుంది?

"సార్... వచ్చే Salaryలో ఖర్చులే సరిపోతున్నాయి. Savings ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి?"

Personal Finance Workshopsలో నన్ను చాలా మంది అడిగే ప్రశ్న ఇదే.

"సార్, Salary తక్కువగా ఉంది. EMIలు, Rent, School Fees, Daily Expenses అన్నీ పోతున్నాయి. Savings చేయడానికి ఏమి మిగలడం లేదు."

అప్పుడు నేను ఒకటే చెబుతాను.

"Savings అనేది Salaryకి సంబంధించిన విషయం కాదు. అది Mindsetకి సంబంధించిన విషయం."



చాలా మంది Salary పెరిగితే Savings చేస్తానని అనుకుంటారు. కానీ నిజానికి Salary పెరిగినా Expenses కూడా పెరుగుతాయి. అందుకే చాలామంది ₹20,000 Salaryలో కూడా "సరిపోవడం లేదు" అంటారు. ₹1,00,000 Salary వచ్చినా అదే మాట చెబుతారు.


ఒక చిన్న ఉదాహరణ

మీరు Officeలో గమనించి ఉండొచ్చు.

కొన్ని చోట్ల Office Boy లేదా Office Assistant దగ్గరే చాలామంది Interestకి డబ్బులు తీసుకుంటారు.

ఆలోచించండి...

వాళ్ల Salary ఎంత ఉంటుంది?

మీ Salary కంటే చాలా తక్కువ.

అయినా వాళ్లు Savings చేసి, అవసరమైనప్పుడు ఇతరులకు Loan ఇచ్చే స్థాయికి వస్తారు.

అంటే విషయం Salary కాదు.

Discipline మరియు Saving Habit.


Daily ₹10 Savings Challenge

ఈరోజు నుంచే ఒక చిన్న Challenge మొదలు పెడదాం.

రోజుకు కేవలం ₹10 మాత్రమే Save చేయండి.

అవును... కేవలం ₹10.

"దీనివల్ల ఏమవుతుంది సార్?" అని అనుకోవచ్చు.

ఈ ₹10 వల్ల పెద్ద Amount రాకపోవచ్చు.

కానీ మీలో ఒక అద్భుతమైన Habit ఏర్పడుతుంది.

అదే Savings Habit.


రోజుకు ₹10 ఎందుకు Save చేయగలం?

రోజుకు:2 లేదా 3 టీలు తాగుతాం, Snacks తింటాం, చిన్న చిన్న ఖర్చులు చేస్తాం

తెలియకుండానే ₹50 నుండి ₹100 వరకు ఖర్చవుతుంది.

అందులో నుంచి ₹10 Save చేయడం అసాధ్యం కాదు.


ఎలా ప్రారంభించాలి?

మీకు రెండు Options ఉన్నాయి.

Option 1: Physical Savings Box

ఇంట్లో ఒక చిన్న డబ్బా లేదా Gullak పెట్టండి.

ప్రతిరోజూ ₹10 అందులో వేయండి.

Option 2: Digital Savings Apps

Jar App వంటి Micro Savings Apps ఉపయోగించవచ్చు.

లేదా మీకు నచ్చిన ఏదైనా Savings App ఉపయోగించవచ్చు.


3 సంవత్సరాల Savings Plan

Year 1

రోజుకు ₹10

365 రోజులకు:

₹3,650


Year 2

రోజుకు ₹20

365 రోజులకు:

₹7,300


Year 3

రోజుకు ₹30

365 రోజులకు:

₹10,950


Total Savings

3 సంవత్సరాల్లో దాదాపు:

₹21,900

అంటే ₹18,000 నుండి ₹22,000 మధ్య Savings ఏర్పడే అవకాశం ఉంది.


ఈ డబ్బుతో ఏమి చేయవచ్చు?

ఈ Savings ద్వారా:

✅ Term Insurance Premium చెల్లించవచ్చు

✅ Health Insurance Premium చెల్లించవచ్చు

✅ Emergency Fund ప్రారంభించవచ్చు

✅ SIP Investment మొదలు పెట్టవచ్చు

✅ ఇంటికి అవసరమైన Product కొనవచ్చు


Consistency Is More Important Than Amount

చాలామంది ఒకేసారి ₹10,000 Save చేయాలని అనుకుంటారు.

కానీ Personal Financeలో Success రావడానికి కారణం పెద్ద Amount కాదు.

Consistency.

అందుకే:

  • Daily Reminder పెట్టుకోండి

  • Google Calendar Reminder వాడండి

  • Auto Debit Setup చేయండి

  • Daily Savings SIP లాగా Treat చేయండి


ఒక రోజు Miss అయితే?

ఏం Problem లేదు.

ఈరోజు ₹10 Miss అయితే...

రేపు ₹20 Save చేయండి.

కానీ Habit మాత్రం Break అవ్వనివ్వకండి.


EPF మనకు నేర్పే గొప్ప పాఠం

ఉద్యోగంలో ఉన్నవారి Salary నుంచి EPF కట్ అవుతుంది.

మన చేతికి వచ్చే Salary అంటే ఇప్పటికే Savings తీసేసిన తర్వాత మిగిలిన Amount.

అందులోనే మనం Adjust అవుతున్నాం.

అంటే మొదట Savings తీసేస్తే మిగిలిన డబ్బుతో జీవించడం మనకు సాధ్యమే.

ఇదే Pay Yourself First Principle.


Savings అనేది Mindset

మరొక్కసారి చెబుతున్నాను.

Savings అనేది Salaryకి సంబంధించిన విషయం కాదు. Mindsetకి సంబంధించిన విషయం.

రోజుకు ₹10 అయినా...

₹20 అయినా...

₹30 అయినా...

మొదలు పెట్టండి.

మొదటి Step వేయండి.

Habit ఏర్పడిన తర్వాత Savings Amount సహజంగానే పెరుగుతుంది.


Financial Planning Workshop

మీ Financial Goals సాధించడానికి సరైన Roadmap కావాలా?

మా Financial Planning Workshopలో మీరు తెలుసుకునేవి:

✔ Children's Education Planning

భవిష్యత్తులో College Education కోసం ఎంత Savings అవసరం?

✔ Marriage Planning

పిల్లల Marriage Goals ఎలా Plan చేయాలి?

✔ Retirement Planning

Retirement తర్వాత Financial Freedom ఎలా పొందాలి?

✔ Home Buying Budget

మీ Salaryకి ఎంత Budgetలో House కొనాలి?

✔ Car Buying Budget

Car EMI మీ Financial Lifeని Damage చేయకుండా ఎలా కొనాలి?

✔ Insurance Planning

మీకు ఎంత Term Insurance & Health Insurance అవసరం?

✔ Debt Management

Loans మరియు Credit Card Debts నుంచి బయటపడటం ఎలా?

✔ Part-Time Income Ideas

పెట్టుబడితో మరియు పెట్టుబడి లేకుండా చేయగల Income Opportunities.


ఈరోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి.

"నేను Savings మొదలు పెడుతున్నాను."

రోజుకు ₹10 అయినా సరే.

ఎందుకంటే...

చిన్న Savings ఈరోజు ప్రారంభమవుతాయి. కానీ పెద్ద Financial Freedom రేపు వాటి నుంచే వస్తుంది.

Comment Challenge

ఈరోజు నుంచి మీరు రోజుకు ఎంత Save చేయబోతున్నారు?

₹10?

₹20?

₹50?

కామెంట్‌లో తప్పకుండా తెలియజేయండి.

మీ Comment చూసి ఇంకొకరు కూడా తమ Savings Journey ప్రారంభించే అవకాశం ఉంది.

Full Video Link: https://youtu.be/ilkncgEk0Tk

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇల్లు కొనాలా? లేక అద్దె ఇంట్లో ఉంటూ Mutual Funds‌లో పెట్టుబడి పెట్టాలా? 20 ఏళ్ల కు లెక్కలు వేసి చూద్దాం

ధనవంతులు కావాలంటే Warren Buffett చెప్పిన ఈ 5 Baby Steps తప్పక Follow అవ్వాలి

ఈ 6 Assets మిమ్మల్ని కాపాడతాయి | Financial Crisis Coming? Secure These 6 Assets Now|