ఈ ఆర్టికల్‌లో మీరు తెలుసుకునేది
Comfort Zone ప్రమాదాలు
Change ఎందుకు అవసరం?
Fear of Unknown ని ఎలా జయించాలి?
Financial Loss తర్వాత ఎలా Recover అవ్వాలి?
Career Growth కోసం కొత్త అవకాశాలు ఎలా వెతకాలి
జీవితం ఒక ప్యాకేజీ (Life is a Package): Real Life Examples
పెద్ద పెద్ద కోటీశ్వరులు, శతకోటీశ్వరుల జీవితాలను ఒకసారి గమనిస్తే మనకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం డబ్బు ఉంటేనే సరిపోదు, జీవితం ఎప్పుడు ఎలాంటి Shock ఇస్తుందో ఎవరూ ఊహించలేరు.
1. రామోజీరావు గారి కుటుంబం (Ramoji Rao & Family)
నేను ‘ఈటీవీ’ (ETV) లో జాబ్ చేస్తున్న రోజుల్లో మా చైర్మన్ గారైన రామోజీరావు గారిని చాలా దగ్గర నుండి చూశాను. అప్పటికే వారు ఎంతో పెద్ద కోటీశ్వరులు, Financial గా వాళ్ళకి ఎలాంటి ఢోకా లేదు, ఎంతో Stable గా ఉన్నారు. కానీ, వాళ్ళ చిన్నబ్బాయి సుమన్ గారికి Cancer వచ్చింది. డబ్బు పరంగా ఎంతో బలంగా ఉన్నా కూడా, Health పరంగా ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది.
2. ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (Dhirubhai Ambani Family Dispute)
ఒకవేళ ఏ కుటుంబంలోనైనా ఫైనాన్షియల్‌గా బాగున్నారు, హెల్త్ కూడా చాలా బాగుంది అనుకుంటే.. Relationship లో ఏదో ఒక గొడవ వచ్చి తీరుతుంది. ధీరూభాయ్ అంబానీ గారు చనిపోయిన తర్వాత ఇద్దరు కొడుకుల (Mukesh Ambani & Anil Ambani) మధ్య వచ్చిన Clashes వల్ల ఫ్యామిలీ రిలేషన్స్ ఎంత దెబ్బతిన్నాయో మనందరికీ తెలుసు. ఆ గొడవల వల్ల ఇండియా Stock Market అంతా కొన్ని రోజులు షేక్ అయిపోయింది.
దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతోంది? ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో ఎవరికీ తెలియదు. మరి ఆ ప్రాబ్లాన్ని మనం ఎలా ఫేస్ చేయాలి? దీనికి అద్భుతమైన సమాధానమే (Spencer Johnson) రాసిన వరల్డ్ ఫేమస్ బుక్ (Who Moved My Cheese?).
"Who Moved My Cheese?" — ఒక చిన్న లైఫ్ చేంజింగ్ స్టోరీ
ఈ పుస్తకంలో ఆథర్ చాలా సింపుల్ క్యారెక్టర్స్‌తో ఒక అద్భుతమైన మానసిక సత్యాన్ని వివరించారు. ఈ బుక్‌లో ఇంగ్లీష్ పేర్లు (Sniff, Scurry, Hem, Haw) ఉన్నాయి, కానీ మనం మన తెలుగు ప్రేక్షకులకు కన్వీనియంట్‌గా ఉండేలా శీను, వేణు అనే ఇద్దరు మిత్రుల ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం.
వీళ్ళతో పాటు రెండు చిన్న ఎలుకలు కూడా ఉండేవి. వీరంతా ఒక పెద్ద గుహ (Maze) లోకి వెళ్లారు. అక్కడ ఒక చోట వీరికి పెద్ద ఎత్తున 'Cheese' (జున్ను) దొరికింది. ఆ చీజ్‌ను రోజూ తినడం, బయటకొచ్చి బాగా తిరగడం, మళ్ళీ ఆడుకొని వెళ్ళిపోవడం వీరికి అలవాటుగా మారింది. చాలా రోజుల వరకు ఆ చీజ్ అక్కడే ఉండేసరికి, వీరంతా ఒక మంచి Comfort Zone లోకి వెళ్ళిపోయారు.
The Danger of the Comfort Zone
"ఇక దీన్ని ఎవరూ ముట్టుకోరు, ఇక్కడికి ఎవరూ రారు, ఇది లైఫ్‌లాంగ్ మనకే ఉంటుంది. ఇక్కడే తింటూ హ్యాపీగా ఉండొచ్చు" అని శీను, వేణు ఫిక్స్ అయిపోయారు. ఆ కంఫర్ట్ జోన్ లో పడిపోయి, ఆ చీజ్‌ను దాచిపెట్టుకోవడం కానీ, భవిష్యత్తు కోసం సెక్యూర్ చేసుకోవడం కానీ, ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ చేయలేదు. తమ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా మారుతున్నాయో గమనించడం పూర్తిగా మానేశారు.
ఒక్కసారిగా మారిన పరిస్థితి (The Unexpected Change)
ఒకరోజు వీళ్ళు ఎప్పటిలాగే గుహలోకి వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న చీజ్ మొత్తం ఖాళీ అయిపోయింది! అది చూసి ఈ నలుగురూ (రెండు ఎలుకలు + శీను, వేణు) తీవ్రంగా డిస్టర్బ్ అయిపోయారు. "అయ్యో! మా చీజ్ ఎక్కడికి పోయింది? ఎవరు దొంగిలించారు?" అని షాక్‌కు గురయ్యారు.
ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ రెండు ఎలుకలు మనుషుల లాగా ఎక్కువ ఆలోచించలేదు. పరిస్థితిని చూసి వెంటనే Realize అయిపోయాయి—"సరే, ఇక్కడ చీజ్ అయిపోయింది, ఇది గతం. ఇక్కడ కూర్చుని ఏడవడం వల్ల కడుపు నిండదు, మనమిక్కడ నుండి బయటకు వెళ్లి ఇంకో చోట చీజ్ వెతుక్కోవాలి" అని ఆ రెండు ఎలుకలు వెంటనే గుహ నుండి బయటకు వచ్చేసి, కొత్త Opportunities కోసం వెతకడం స్టార్ట్ చేశాయి.
మనుషుల మైండ్‌సెట్ మరియు బ్లేమ్ గేమ్ (Human Mindset & Blame Game)
కానీ శీను, వేణు మనుషులు కదా! మనం అంత తొందరగా ఒక ప్రాబ్లాన్ని, జీవితంలో వచ్చే మార్పును Accept చేయలేము.
"మనకే ఎందుకు ఇలా జరిగింది? దేవుడు మనల్నే ఎందుకు టార్గెట్ చేశాడు?" అని ఏడవడం మొదలుపెట్టారు.
"నువ్వు తీశావా అంటే నువ్వు తీశావు, నువ్వు ఎవరికైనా చెప్పి ఉంటావు" అని ఒకరినొకరు నిందించుకుంటూ (Blame Game) గొడవ పడేవారు.
దాదాపు రెండు మూడు రోజులు తినడానికి ఏమీ దొరక్క చాలా అవస్థలు పడ్డారు. అయినా సరే కొత్త దారి వెతకకుండా.. "అది ఉన్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉన్నాం, మళ్ళీ ఆ పాత రోజులు వచ్చేస్తే బాగుండు" అని పాత జ్ఞాపకాల్లోనే ఉండిపోయారు.
🏃♂️ వేణు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం (Moving Forward)
ఆ తర్వాత మూడో రోజు వేణుకు రియాలిటీ అర్థమైంది—"నాకు తెలిసి ఈ పాత చీజ్ ఇక తిరిగి రాదు, నేను ఇక్కడే ఉంటే ఆకలితో చావడం ఖాయం. నేను ముందుకు వెళ్లాల్సిందే."
నిజానికి, ముందుకు వెళ్దామంటే వేణుకు కూడా చాలా భయం వేసింది (Fear of Unknown). గుహ దాటి బయటకు వెళ్తే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో, అసలు కొత్త చీజ్ దొరుకుతుందో లేదో అని భయపడ్డాడు. అయినా సరే, బతకాలంటే ప్రయత్నం చేయాలి కదా అని ధైర్యం చేసి బయలుదేరాడు. శీనుతో "నేను వెళ్ళిపోతున్నాను, ఇంకో చీజ్ వెతుక్కుంటాను, నువ్వు కూడా రా" అని పిలిచాడు. కానీ శీను భయంతో రానని మొండికేసాడు.
సవాళ్లను దాటుకుంటూ.. (Overcoming Hurdles)
వేణు గుహ నుండి బయటకు వచ్చి, కొత్త మార్గాల కోసం వెతుకుతుండగా దారిలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. లోతైన కాలువలు అడ్డొచ్చాయి, కొన్ని అడవి జంతువులు దాడి చేశాయి. కానీ వేణు వెనక్కి తగ్గలేదు. వాటన్నింటి నుంచి తప్పించుకుంటూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాడు.
The Grand Reward (గొప్ప విజయం)
చాలా కష్టాలు పడుతూ, ఎంతో దూరం తిరగ్గా తిరగ్గా.. ఒక కొత్త ప్రదేశంలో వేణుకు సరికొత్త చీజ్ దొరికింది. ఎంత దొరికిందో తెలుసా? మునుపటి కంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువ, అంతకంటే చాలా టేస్టీగా ఉన్న బల్క్ చీజ్ దొరికింది!
అప్పుడు వేణు నవ్వుకుంటూ అనుకున్నాడు—"నేను పాత గుహలోనే ఉండి, దాన్నే ప్రపంచంలో పెద్ద టేస్ట్ అనుకుని భ్రమపడ్డాను. కానీ సాహసం చేసి బయటకు వచ్చాక తెలిసింది.. అంతకన్నా వంద రెట్లు మెరుగైన జీవితం, టేస్టీ చీజ్ బయట వేచి ఉందో అని!" కానీ ఇది దొరకడానికి అతను భయాన్ని వదిలి కష్టపడాల్సి వచ్చింది, వెతకాల్సి వచ్చింది.
మరోవైపు శీను ఎక్కడైతే ఉన్నాడో మార్పును అంగీకరించకుండా అక్కడే ఉండిపోయాడు. ఫుడ్ లేక, నీరసించిపోయి అతని లైఫ్ పూర్తిగా గందరగోళం (Chaos) అయిపోయింది.
💡 ఈ స్టోరీని మన రియల్ లైఫ్‌కు ఎలా అప్లై చేయాలి? (Practical Life Application)
చాలా మంది మన రియల్ లైఫ్‌లో కూడా శీను లాంటి సిచువేషనే ఫేస్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక జాబ్‌లో ఉన్నారు లేదా ఒక బిజినెస్‌లో ఉన్నారు అనుకుందాం.. దాంట్లో పెద్ద Growth లేదు, సరిపోక అప్పులు చేస్తూ అక్కడే నలిగిపోతున్నారు. కానీ దాని నుంచి బయటపడాలంటే మాత్రం భయం వేస్తుంది.
"నాకు ఇందులో 15 ఏళ్ల Experience ఉంది, 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఇప్పుడు ఈ వయసులో వెళ్లి నేను కొత్తగా ఏం ట్రై చేస్తాను? ఏం ప్రయత్నం చేస్తాను?" అని అదే Comfort Zone లో ఉండిపోతారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి